![]() |
![]() |
.webp)
స్టార్ మాలో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ షో ప్రతీ వారం ఒక్కో కాన్సెప్ట్ తో అలరిస్తూ వస్తోంది. ఇక రాబోయే వారం కాన్సెప్ట్ గా ‘లెజెండ్స్ ఆఫ్ మ్యూజిక్" అనే రౌండ్ ని అనౌన్స్ చేశారు. దీంతో కంటెస్టెంట్ సింగర్స్ అంతా తమ సాంగ్స్ తో అదరగొట్టారు. ఈ వారం ప్రోమో చూస్తే మంచి కలర్ ఫుల్ లుక్ లో అదిరిపోయింది. స్టార్టింగ్ లో ‘పరువం వానగా’ అంటూ జడ్జ్, సింగర్ శ్వేతా మోహన్ పాడి వినిపించి స్టేజి మీద ఉన్న అందరినీ మరో లోకంలోకి తీసుకెళ్లిపోయారు. తర్వాత కంటెస్టెంట్ ప్రవస్తి "ఆడ జన్మకు ఎన్ని శోకాలో" అంటూ అద్భుతంగా పాడింది. ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నందుకు శ్వేతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. ఈ సాంగ్ పాడడం వెనక ఒక కారణం ఉంది అని శ్రీముఖి చెప్పేసరికి ప్రవస్తి ఏడ్చేసింది. " నాలుగైదేళ్ల ముందు వరకు నా జీవితం చాలా బాగుంది తర్వాత మా నాన్న జాబ్ వదిలేశారు.
దాంతో మేము ఆర్థికంగా చితికిపోయాం. అమ్మకు రెండు సార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇంకోసారి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఆమె ఇక బతకదు అని డాక్టర్స్ చెప్పారు. ఇక నేను తెచ్చే డబ్బుతోనే ఇల్లు గడుస్తోంది" అంటూ తన పెయిన్ గురించి చెప్పి అందరినీ ఏడిపించేసింది." ఇక ఫైనల్ లో కంటెస్టెంట్ తరుణీ "నరుడా ఓ నరుడా" అనే సాంగ్ పాడింది. తన తండ్రికి ఇష్టం లేకుండా పాటలు పాడటానికి వచ్చానని తరుణీ స్టార్టింగ్ లోని చెప్పింది. ఇక శ్రీముఖి తరుణీ వాళ్ళ నాన్నను స్టేజి మీదకు తీసుకొచ్చి సర్ప్రైజ్ చేసింది. తరుణీ వాళ్ళ నాన్నను చూసి ఏడ్చేసింది. "మా పాప నాకు ఇంత పేరు తెస్తుందని తెలీదు." అని అన్నాడు తరుణీ వాళ్ళ నాన్న. తరుణీ వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. ఇక ఆ ఇన్సిడెంట్ చూసిన శ్రీముఖి తన లైఫ్ లో జరిగిన విషయం చెప్పింది "తాను యాంకర్ కావడం తన డాడ్ కి ఇష్టం లేదని కానీ తన మదర్ సపోర్ట్ చేసింది..ఇలాంటి అమ్మలందరికీ థ్యాంక్యూ." అని చెప్పింది. "ఒక కళ మీద ఆసక్తి ఉన్నప్పుడు సపోర్ట్ చేయకపోతే ఎంతో మంది ఇళయరాజాలు ఇళ్లల్లోనే ఉండిపోతారు. తరుణీ వాళ్ళ అమ్మలా సపోర్ట్ చేస్తే ఎంతో మంది ఏఆర్.రెహ్మాన్ లు శిఖరాల మీద ఉంటారు" అంటూ అద్భుతమైన డైలాగ్ చెప్పారు అనంత శ్రీరామ్.
![]() |
![]() |